రివైజ్ కోర్స్ మురళి 31-12-2015                                        

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

“డ్రామాలో ఈ సంగమమిలనము చాలా చాలా అమూల్యమైనది మరియు అతీతమైనది, ప్రియమైనది, భాగ్యశాలి పిల్లలకు మాత్రమే అకస్మాత్తుగా లభించే లాటరీ ఇది" 

* ఈ రోజు ప్రేమికులైన పిల్లలందరూ తమ ప్రియుడైన బాబాతో మిలనం జరుపుకోవడానికి వచ్చారు. బాప్ దాదా కూడా నలువైపుల ఉన్న పిల్లలందరినీ చూసి వాహ్ అంటూ సంతోషిస్తున్నారు, నా నయనాలలో పిల్లలు ప్రతి ఒక్కరూ ఇమిడి ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంది, ఆ విశేషత వలనే పిల్లలు మరియు తండ్రి మిలనం జరుగుతుంది.

* ప్రతి ఒక్కరి నయనాలు ఈ మిలనంలో ఎంత సంతోషంగా ఉన్నాయంటే ఈ సాకార ప్రపంచంలో సాకార రూపంలో తండ్రి మరియు పిల్లల ఈ మిలనము అద్భుతమైనదని అందరూ భావిస్తున్నారు. ఈ విధంగా బాబా మిలనం అవుతుందని మేము అస్సలు అనుకోలేదు. ఇటువంటి మిలనము సాధ్యపడుతుందని కలలో కూడా అనుకోలేదు.

* పిల్లలు తండ్రితో ఉన్నప్పటికీ తమ తోటివారిని కలుసుకునే అవకాశం చూసి అకస్మాత్తుగా లభించిన లాటరీలా భావిస్తున్నారు. ఈ విధంగా సాకార రూపంలో మిలనము అన్నది చాలా పెద్ద అమూల్యమైన మిలనము. కనుక ఈ మిలనాన్ని ఎలా జరుపుకోవాలంటే తర్వాత ఈ మిలనపు స్వరూపం నుండి హృదయంలో పదే పదే బాబా కనిపించాలి, ఇప్పుడు కూడా మిలనం చేసుకుంటున్నామన్న అనుభవం కలగాలి. తండ్రి మరియు పిల్లల మిలనము ఎంతటి ప్రియమైనది మరియు ఎంత సంతోషాన్ని ఇస్తుంది. బాబా నా వారు, నన్ను కలిసారు.

* మరి ఈరోజు అందరి మనసులలో తండ్రి మరియు పిల్లల అవ్యక్త మిలనము ఎలా ఉంటుంది, ఆ అనుభవం పిల్లలందరికీ బాప్ దాదా అనుభవం చేయిస్తున్నారు. అందరూ ఈ మిలనమును జరుపుకున్నారా! సాధారణ విషయం కాదు. ఈ మిలనపు భాగ్యాన్ని తీసుకోవడం, ఇది అందరికీ లభిస్తుంది. కానీ లభించిన భాగ్యాన్ని అనుభవంలోకి తీసుకురావడం, ఈ అనుభవాలు చాలా ఉన్నాకానీ రియల్ గా అనుభవం చేసుకోవడం ఇది భాగ్యపు విషయము. ఇటువంటి భాగ్యాన్ని భాగ్యశాలురే పొందగలరు.

* అందరి హృదయాలలో ఎవరు నిండి ఉన్నారు? బాబా. నా బాబా, ప్రియమైన బాబా. బాబా హృదయంలో అయితే రాత్రి పగలు పిల్లలే పిల్లలుంటారు ఎందుకంటే అందరి హృదయాలు స్మృతి చేసేది బాబానే. మిలనము కూడా బాబాదే. బాబా ఎంత భోలా భండారీ కదా, స్మృతి చేయగానే ప్రాప్తి ఇచ్చేస్తారు. కొంతమంది ఎంత బంధనమున్నా కానీ వారు ఆలోచించే పద్ధతులను చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తారు. ఇంకెవ్వరి ఆలోచనకు రానంత విధంగా ఉపాయాలను ఆలోచిస్తారు.

అందుకే సంగమయుగంలో మాతలు ఎంత ధైర్యవంతులు వచ్చారంటే ఏమవుతుందోనన్న భయమే లేదు..., దెబ్బలు కూడా తింటారు కానీ బాబా లభించారు అంటే అన్నీ లభించినట్లే. బాబా వారి చతురతను చూసి, ఏ విధంగా బంధనాన్ని తొలగించుకున్నారు, ఏ విధంగా లాభాన్ని పొందారు, ఈ కథలు విని బాబా కూడా ఆనందిస్తారు. నూతన సంవత్సర ఆగమనం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు:- బాబా ఆజ్ఞ అనుసారంగా వెళ్తున్నారు, ముందుకు, ఇంకా ముందుకు వెళ్తారు. విజయమైతే నిశ్చితమై ఉంది. విజయదాత మన తోడుగా ఉన్నారు, అలాంటప్పుడు విజయం ఇంకెక్కడికి వెళ్తుంది!

* ఈరోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. నూతన సంవత్సరం మొదలవుతుంది అంటే అందులో నవీనతను తేవాలన్న ఆలోచన తప్పక ఉంటుంది. ప్రారంభమయ్యే ఈ క్రొత్త సంవత్సరంలో ఏదో ఒక నవీనతను తీసుకురావాలి. ఇందుకోసం ఎవరికైనా ఏమైనా ఆలోచనలు ఉంటే, కొత్తగా ఉండాలి అనుకుంటే వ్రాసి పంపించండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

సదా ఆరోగ్య భవ!